1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (15:34 IST)

బిగ్‌బాస్‌ షోను బూతుల స్వర్గంగా మారుస్తారా?

narayana
బిగ్ బాస్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే బిగ్‌బాస్‌ వల్ల సమాజానికి ఉపయోగం ఏమీ లేదని ఈ షోను బ్యాన్‌ చేయాలంటూ కొందరు ట్రోల్‌ చేస్తుంటారు. 
 
తాజాగా బిగ్‌బాస్‌ షోపై మరోసారి తన ఆగ్రహం వెళ్లగక్కారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇప్పటికే బిగ్ బాస్ షోపై ఎన్నో సార్లు విమర్శలు గుప్పించిన నారాయణ మరోసారి ఈ రియాల్టీ షోపై దుమ్మెత్తిపోశారు. 
 
బిగ్ బాస్‌పై నారాయణ మాట్లాడుతూ.. 'కాసులకు కక్కుర్తి పడేవాళ్లున్నంతకాలం ఇలాంటి షోలు ఉంటాయి. బిగ్‌బాస్‌ షోతో ఏం సందేశం ఇస్తున్నారో ప్రేక్షకులు ప్రశ్నించాలి. బిగ్‌బాస్‌ షోను బూతుల స్వర్గంగా మారుస్తారా? అదొక అనైతిక షో. వింత జంతువులు ఈ హౌస్‌లోకి వచ్చాయి' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.