బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 16 మే 2020 (16:25 IST)

ఏపీలో జూన్‌ 3న ఇంటర్‌ పరీక్ష

కరోనా వైరస్‌ కారణంగా ఆగిపోయిన ఇంటర్‌ పరీక్ష జూన్‌ 3న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి ఒక ప్రకటన విడుదల చేసింది.

ఏప్రిల్‌ 23న జరగాల్సిన ఇంటర్మీడియేట్‌ ద్వితీయ సంవత్సరం మోడ్రన్‌ లాంగ్వేజ్‌, జియోగ్రఫీ పరీక్షలు జూన్‌ 3న జరుగుతాయని పేర్కొంది.

కరోనా నివారణ జాగ్రత్తలు పాటిస్తూ ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మాస్క్‌ను కచ్చితంగా వెంట తెచ్చుకోవాలని ఆదేశించింది.