గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (20:27 IST)

ఉపాధ్యాయులకు ట్యాబ్స్ వినియోగం.. బాలికలకు ప్రత్యేక జూనియర్ కాలేజీలు

jagan ys
తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో వివిధ కార్యక్రమాల అమలు, పురోగతిపై సీఎం చర్చించారు. ప్రాథమిక విద్యలో 100 శాతం మంది పిల్లలు బడిలోనే ఉన్నారని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. 
 
8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన ట్యాబ్‌ల వినియోగంపై సీఎం సమీక్షించారు. ఈ ఏడాది రెండో విడత ట్యాబ్‌లు ఇచ్చేందుకు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. 
 
టోఫెల్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధతపై సీఎం ఆరా తీశారు. వారంలో మూడు పీరియడ్‌ల చొప్పున మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడి పిల్లలకు అందించే ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించి గతంలో ఎన్నడూ లేని విధంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారన్నారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదు. 
 
నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. చిన్నారులకు అందజేసే ఆహారాన్ని ప్రతిరోజూ పర్యవేక్షించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 
 
ప్రతి మండలంలో బాలికల కోసం ఒకటి చొప్పున రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు సీఎం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.