1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 20 డిశెంబరు 2017 (15:26 IST)

నవరత్నాల విషయంలో వెనక్కి తగ్గుతున్న జగన్....

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో సంవత్సరం గడువు ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ముందు నుంచే హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. అందులో ప్రధానంగా నవరత్నా

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో సంవత్సరం గడువు ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ముందు నుంచే హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. అందులో ప్రధానంగా నవరత్నాలు గుప్పించారు జగన్. నవరత్న హామీలపై ప్రజల్లో ఆలోచన కూడా మొదలైంది. రైతులకు ప్రతి యేడాది మే నెలలో 12 వేల రూపాయలు రైతన్న భరోసా ఇవ్వడంతో పాటు రైతులకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలు, పంటకు గిట్టుబాటు ధర కల్పించడం ఇలా ఎన్నో హామీలు ఉన్నాయి.
 
ఈ హామీలన్నీ నెరవేర్చడం సాధ్యమవుతాయో లేదో తెలియదు కానీ వాటిని చేసి చూపిస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మాటలు చెప్పి మోసగించడం నాకు తెలియదు. ఏదైనా చేతల్లో చూపించే సత్తా నాకుంది. నవరత్నాల విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లు టిడిపి నేతలు ప్రచారం చేస్తున్నారు. అది ఎంతమాత్రం నిజం కాదు. నవరత్నాలను అమలు చేస్తూ వాటిని మించిన పథకాలను ప్రవేశపెట్టి ప్రజాభివృద్థికి పనిచేసి తీరుతానంటూ జగన్ పాదయాత్రలో హామీలిస్తున్నారు.