శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2019 (17:18 IST)

జగన్ 100 రోజుల పాలనపై జనసేనాని అసంతృప్తి.. అప్పులకు వడ్డీలు కడుతుంటే?

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంద రోజుల పాలనపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.  జగన్ 100 రోజుల పాలనపై టీడీపీ, బీజేపీ నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పించగా.. తాజాగా జనసేన నివేదికను విడుదల చేసింది. 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. వైసీపీ పాలనలో పారదర్శక, దార్శనికత లోపించిందని ఆ నివేదికలో జనసేన పేర్కొంది. 
 
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీ 100 రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని విమర్శించారు. పాలనలో దార్శనికత, పారదర్శకత లోపించిందన్నారు. ఎన్నికల్లో 150కి పైగా సీట్లను గెలుచుకున్న వైసీపీ పాలనపై కనీసం ఒక సంవత్సరం వరకు తాము మాట్లాడాల్సిన అవసరం ఉండదని అనుకున్నామని.. కానీ, మూడు వారాల్లోపే వారు తీసుకున్న ఆందోళనకర నిర్ణయాలు ప్రజలు ఆక్షేపించేలా ఉన్నాయని విమర్శించారు.
 
రాష్ట్రానికి రూ. 2.58 లక్షల కోట్ల అప్పులున్నాయని.. దీనికి తోడు జగన్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ.50 వేల కోట్లు కావాలని పవన్ తెలిపారు. ఇప్పటికే తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ మళ్లీ కొత్త పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని పవన్ ప్రశ్నించారు.
 
'ఏపీ ప్రజలకు పోలవరం జీవనాడి. పోలవరంలో అవకతవకలు జరిగితే విచారణ జరిపించాలి. పోలవరం ఆపేస్తే రైతాంగానికి, విశాఖ తాగునీటికి ఇబ్బంది పడుతుందని గుర్తు చేశారు. వైసీపీ తీరు వల్ల వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని పవన్ వ్యాఖ్యానించారు.