గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 3 డిశెంబరు 2021 (21:23 IST)

వాయువేగంతో దూసుకొస్తోన్న జవాద్ తుఫాన్

ఫోటో కర్టెసి-ఐఎండి
తుఫాను జవాద్ గత 6 గంటల్లో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా సాయంత్రం 5.30 గంటలకు కేంద్రీకృతమై, విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కి.మీ కేంద్రీకృతమై వుంది. గోపాల్‌పూర్‌కు దాదాపు 420 కి.మీ, పూరీకి 480 కి.మీ వుంది.

 
ఇది రేపు, డిసెంబర్ 4 ఉదయం నాటికి ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, మరింత బలపడి, ఉత్తర ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశా తీరాలకు పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరాన్ని దాటే అవకాశం వుంది.

 
ఆ తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరం వెంబడి డిసెంబర్ 5 మధ్యాహ్నం పూరీకి చేరుకునే అవకాశం ఉంది. తదనంతరం ఇది ఒడిశా తీరం వెంబడి పశ్చిమ బెంగాల్ తీరం వైపు ఉత్తర-ఈశాన్య దిశగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.