సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 మార్చి 2022 (08:40 IST)

మంత్రి పదవి లేకపోతే నా విశ్వరూపం చూపిస్తా : కొడాలి నాని

మంత్రి పదవి అనేది లేకుంటే తన విశ్వరూపం చూపిస్తానని మంత్రి కొడాలి నాని అన్నారు. పైగా, తన మంత్రి పదవిపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, దివంగత తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను మోసం చేశారని ఆరోపిస్తూ ప్రతిపక్షంపైనా, అధినేత చంద్రబాబు నాయుడుపైనా ఆయన మండిపడ్డారు. 

 
మంత్రి పదవిపై తనకున్న నిబద్ధతను ప్రదర్శించేందుకు తనకు ఎలాంటి గ్రేడ్‌లు అవసరం లేదన్నారు. 'నేను జీవించి ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీ పక్షాన పోరాడుతానని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రయోజనాలను కాపాడుతాను' అని కొడాలి నాని స్పష్టం చేశారు.

 
ప్రభుత్వంలో మంత్రిగా ప్రభుత్వం పరువు పోకుండా చూసుకుంటాను’ అని వ్యాఖ్యానించారు. తాను మంత్రివర్గం నుంచి వైదొలిగిన తర్వాత, వ్యతిరేకతను మరింతగా బయటపెట్టే స్వేచ్ఛ తనకు ఉంటుందని ఆయన అన్నారు. మంత్రి పదవి అనేది లేకుంటే తన విశ్వరూపం ప్రదర్శిస్తానని ఆయన ప్రకటించారు.