బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (10:35 IST)

వేధింపు పాల్ప‌డిన వారిపై కేసులు న‌మోదు చేయాలి : కోదండ‌రాం

తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక, ఆర్థిక దోపిడీ అంశంపై చర్చా కార్యక్రమం హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ‌న స‌మితి అధ్య‌క్షుడు కోదండ‌రాం మాట్లాడుతూ... మహిళ ఆర్టిస్

తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక, ఆర్థిక దోపిడీ అంశంపై  చర్చా కార్యక్రమం హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ‌న స‌మితి అధ్య‌క్షుడు కోదండ‌రాం మాట్లాడుతూ... మహిళ ఆర్టిస్టుల డిమాండ్లకు నా సంపూర్ణ మద్దతు తెలియ‌చేస్తున్నాను. తెలుగు వారికే 90 శాతం అవకాశాలు ఇవ్వాలి. అమ్మాయిల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఫ్యూడల్ వ్యవస్థను గుర్తుకు తెస్తున్నాయని ఆందోలన వ్యక్తం చేస్తున్నారు.
 
సినీ పరిశ్రమ అందరికీ ఆదర్శంగా నిలవాలి. సినీ పరిశ్రమ పట్ల సమాజంలో గౌరవం పోతుంది. మొన్న మాదకద్రవ్యాల ముద్ర, ఇప్పుడు లైంగిక వేధింపుల ముద్ర సినిమా ఇండస్ట్రీపై పడింది. చిత్ర పరిశ్రమ నాగరిక విలువలకు కట్టుబడి ఉండాలి. ఇంత జరుగుతుంటే ఎందుకు ప్రభుత్వం కేసు నమోదు చేయకుండా ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది. వేధింపులకు పాల్పడ్డ వారిపై ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు.