Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

భార్య జీతం ఎక్కువని అనుమానపు వేధింపులు.. జీవితం ఆరిపోయింది...

ఆ భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. భర్త జీతం కంటే భార్య జీతం ఎక్కువ. దీంతో భార్యపై అనుమానం పెంచుకుని భర్త వేధించసాగాడు. దీనికితోడు ఇద్దరు పిల్లలను తనతోపాటు తీసుకెళ్లాడు. దీంతో ఒంటరిత

Written By pnr
Updated: శుక్రవారం, 15 జూన్ 2018 (10:12 IST)
ఆ భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. భర్త జీతం కంటే భార్య జీతం ఎక్కువ. దీంతో భార్యపై అనుమానం పెంచుకుని భర్త వేధించసాగాడు. దీనికితోడు ఇద్దరు పిల్లలను తనతోపాటు తీసుకెళ్లాడు. దీంతో ఒంటరితనం భరించలేక ఆ మహిళ తన జీవితాన్ని అర్థాంతరంగా ఆర్పివేసుకుంది. విశాఖపట్టణంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
విశాఖ చినవాల్తేరు కిర్లంపూడి ప్రిన్స్‌ అపార్టుమెంట్‌లో పీతల అప్పారావు నివాసముంటున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు రెండో కుమార్తె వాణి (35)ని జడ్పీ సమీపంలోని కృష్ణానగర్‌కు చెందిన పసుపులేటి గంగాధర్‌కు ఇచ్చి 2011లో వివాహం చేశారు. 
 
ఈ భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. వాణికి రూ.7.8 లక్షలు జీతం కాగా గంగాధర్‌ జీతం రూ.4 లక్షలు. వీరికి ఆరేళ్లు, మూడేళ్ల వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య జీతం ఎక్కువ కావడంతో ఆమెపై అనుమానం పెంచుకున్నారు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఫలితంగా అమెరికా నుంచి గత యేడాది ఏప్రిల్ నెలలో నగరానికి తిరిగివచ్చేశారు. 
 
వాణి ఇద్దరు పిల్లలతో పుట్టింట్లో ఉంటుండగా, గంగాధర్‌ తన తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ఈ పరిస్థితుల్లో గంగాధర్‌ పిల్లలను తన వద్దకు రప్పించుకున్నాడు. అపుడు తాను కూడా వస్తానని భర్తతో భార్య చెప్పింది. కానీ, భర్త సమ్మతించలేదు. 
 
దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. బుధవారం ఎప్పటిలాగే నిద్రపోయింది. ఉదయం బయటకు రాకపోవడంతో అనుమానంతో తలుపులు బద్ధలు కొట్టిచూసేసరికి వాణి అచేతనంగా ఉంది. గంగాధర్‌ వేధింపుల వల్లే వాణి ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరి సుహాసిని ఆరోపించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా హీరో కుమార్తె

నేను చేసిన 6 నిమిషాల నవరసాల సీన్ హైలైట్ గా నిలుస్తుంది - నరేష్ విజయ కృష్ణ

Kajal Chowdary: గోల్డ్ స్పాట్ మూవీ ఫస్ట్ సింగిల్ పరిచయమే. రిలీజ్

జై జాస్తి, మేధ మేక హీరో హీరోయిన్‌లుగా మైత్రీ ఇన్ లవ్ ప్రారంభం

Deva Katta: వ‌ర్షాలు ప‌డితే వ‌జ్రాలు దొరుకుతాయనే కథ తో జో జో’ కాష‌న్ 1 చిత్రం

తర్వాతి కథనం
Show comments