సొంత చెల్లెలిని నడిరోడ్డుపై వివస్త్రను చేసిన అన్న....?
తూర్పు గోదావరిజిల్లాలో అమానుషం జరిగింది. బిక్కవోలు దళితపేటలో దళిత మహిళలపై దాష్టీకానికి దిగారు. తల్లి కూతుళ్ళను వివస్త్రను చేసి హింసించారు బంధువులు. బాధితుల ఫిర్యాదుతో అసలు విషయం బయటకు వచ్చింది.
సాల్మన్ రాజు, విశాఖలో ఎస్బిఐ బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తూర్పు గోదావరిజిల్లా బిక్కవోలు దళితపేటలో ఈయనకు తన తండ్రి ఇచ్చిన స్థలం ఉంది. సాల్మన్ రాజు చెల్లెలు మంగావేణికి కూడా ఇక్కడే స్థలం ఉంది. ఇద్దరికీ పక్కపక్కనే స్థలాలు ఉన్నాయి. అయితే ఇద్దరి మధ్య స్థల వివాదం నడుస్తోంది. స్థలం మధ్యలో గోడ కట్టవద్దని సాల్మన్ రాజు, గోడ కట్టాలని చెల్లెలు వేణిలు పట్టుబడుతూ వచ్చారు.
అయితే నిన్న మంగావేణి గోడ కట్టేందుకు ప్రయత్నించగా తన బంధువులను వెంట పెట్టుకుని వచ్చిన సాల్మన్ రాజు ఆమెపై దాడికి దిగాడు. నడిరోడ్డుపై వివస్త్రను చేశాడు. అడ్డుగా వచ్చిన మంగావేణి కుమార్తెను కూడా వివస్త్రను చేశాడు. దీంతో బాధితులు పోలీసులు ఆశ్రయించారు.