శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (14:30 IST)

అది పొట్ట కాదు.. రాళ్ళకుప్ప... మహిళ పొట్టలో 1500 రాళ్లు

సాధారణంగా కిడ్నీల్లో రాళ్లు ఉండటాన్ని వింటుంటాం. కానీ, ఆ మహిళ పొట్ట మాత్రం పొట్ట కాదు.. ఓ రాళ్ళ కుప్ప. ఆమె పొట్టలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందల సంఖ్యలో రాళ్లు ఉండటం వైద్యులను సైతం విస్మయానికిగురిచేసింది. లుథియానాలోని ప్రజా వైద్యశాలు చెందిన వైద్యులు ఈ రాళ్లను గుర్తించారు. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే, మణిపూర్‌కు చెందిన ప్రేమలత గడచిన మూడేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడూ వచ్చింది. ఎంతో మంది వైద్యుల వద్దకు వెళ్లినా ఆమెకు ఉపశమనం మాత్రం లభించలేదు. చివరికి లూథియానాకు చెందిన డాక్టర్‌ మిల్నే వర్మ గురించి తెలియడంతో ఆయనను సంప్రదించింది. ఆయన పలు పరీక్షల అనంతరం పొట్టలో పెద్దమొత్తంలో రాళ్లున్నాయని గుర్తించారు.
 
శస్త్ర చికిత్స చేసి తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పి ఏర్పాట్లు చేశారు. అయితే చాలా రాళ్లు తక్కువ పరిమాణంతో ఉండడంతో ల్యాప్రోస్కోపీ విధానం అనుసరించి ఆపరేషన్‌ చేశారు. కాగా, ప్రేమలత పొట్టలో పెద్ద రాళ్లకుప్పే ఉండడం వైద్య సిబ్బందినే ఆశ్చర్య పరిచింది. శస్త్రచికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది.