మంగళవారం, 12 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2024 (11:21 IST)

మిస్ ఇండియాకు అర్హత సాధించిన కుప్పం యువతి... అభినందించిన సీఎం చంద్రబాబు

kuppam girl
మిస్ యూనివర్స్‌గా కుప్పం యువతి చందన ఎంపికయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ యువతిని అభినందించారు. కుటుంబ సభ్యులతో తనను ఆ యువతి కలిసింది. మిస్ యూనివర్స్ ఇండియాకు ఏపీ నుంచి చందన జయరాం అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయంలో చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెకు అభినందనలు తెలియజేశారు. 
 
ఇటీవల హైదరాబాద్ నగరంలో నిర్వహించిన పోటీల్లో చందన మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్ర నుంచి ఎంపిక అయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో చందన పాల్గొననున్నారు. తన నియోజకవర్గం కుప్పం నుంచి మిస్ యూనివర్శ్ ఇండియా పోటీలలకు చందన అర్హత సాధించడంపై సీఎఁ చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.