కృష్ణానదికి మరింత వరద
భారీ వరద నీరుతో కృష్ణానది ప్రవాహం ఉధృతం కానుంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి నాగార్జునసాగర్ నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశo ఉంది.
ప్రస్తుతం కృష్ణ బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 33,002 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 24,750 క్యూసెక్కులుగా ఉంది. దీంతో జిల్లా యంత్రాంగం వరద ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేశారు.
కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
అంతేకాకుండా మత్య్సకారుల పడవలు, ఇళ్లల్లో పెంచుకునే పాడిపశువులు, మేకలు వంటివి సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించాలని ఆదేశించారు.
బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని కోరారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని అధికారులు తెలిపారు.