బీజేపీలో టీడీపీ విలీనానికి చంద్రబాబు రాయబారం : విజయసాయి ఆరోపణ  
                                       
                  
				  				   
				   
                  				  తెలుగుదేశం పార్టీపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని రాబోయే రోజుల్లో బీజేపీలో విలీనం చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. 
				  											
																													
									  
	 
	అవినీతి కేసులు లేకుండా చేస్తే తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని రాయబారాలు పంపింది చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. రాజీలో భాగంగానే నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రాజ్యసభలో టీడీపీ పక్షం బీజేపీలో విలీనం అయిన సంగతి ప్రజలకు తెలుసునన్నారు. 
				  
	 
	రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపినా ఇంకా మీపైన ఫిర్యాదు చేస్తారన్న భయమెందుకు అంటూ సెటైర్లు వేశారు. భవిష్యత్ ఏమైనా కళ్లముందు కనిపిస్తోందా అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి పంచ్‌లు వేశారు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	అంతకుముందు చంద్రబాబు నాయుడు సీఎం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
	 
				  																		
											
									  
	ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని ఏ ముఖ్యమంత్రి అయినా కలిస్తే నిధులు అడుగుతారని కానీ జగన్ మాత్రం తనపై రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి తనపైనే ఫిర్యాదులు చేశారంటూ విమర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇంకా భయమెందుకు అంటూ వ్యంగ్యంగా విజయసాయిరెడ్డి స్పందించారు.