ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 21 డిశెంబరు 2021 (10:19 IST)

కోడి పందాలు వేసుకోనివ్వండి సార్... సీఎం జగన్ కు ముద్రగడ లేఖ!

కాపు మ‌హానాడును ఉధృతంగా న‌డిపిన రాజకీయ దిగ్గ‌జం ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చివ‌రికి కోడి పందాలపై ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి లేఖ రాశారు. సంక్రాంతి పండుగ‌కు కోడిపందాలు వేసుకోనివ్వండి సార్ అంటూ, సీఎం జ‌గ‌న్ ను ప్రాధాయ‌పడుతూ లేఖ రాశారు. 

 
సిం యం జగన్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ ఈ లేఖ రాశారు. సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో ఐదు రోజుల పాటు కోడి పందాలకు పర్మిషన్ ఇస్తూ, పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ముద్రగడ లేఖ ద్వారా సీఎం జగన్ ను కోరారు.
 
 
కోడి పందాలు వంటివి జల్లికట్టు కంటే ప్రమాదకరమైన ఆటలు కావని, గ్రామాల్లో సంక్రాంతికి ఎడ్ల పందాలు, కోడి పందాలు, జాతర్లు ఆచారమని ముద్ర‌గ‌డ సీఎంకు గుర్తు చేశారు. సంక్రాంతి పండుగ‌కి ముందు ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అనేక ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్ర‌జ‌ల నుంచి ఒత్తిడి ఎక్కువై, పండుగ‌కు ముందు, చివరికి పర్మిషన్ ఇచ్చేయటంతో పోలీస్ శాఖ కూడా ఇబ్బంది పడుతోందని ముద్ర‌గ‌డ పేర్కొన్నారు. 

 
పండుగుల సమయంలో ప్రజలకు పని ఉండదు కాబట్టి,  ఉత్సవాల్లో పాల్గొంటారని ముద్ర‌గ‌డ వ్యాఖ్యానించారు. పండుగలకు ప్రజలు స‌ర‌దాగా గ‌డ‌పాల్సింది పోయి, కోడి పందాల కోసం జైలుకు వెళ్లేలా పరిస్థితి ఉండకూడదని ముద్రగడ కోరారు.