శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (16:24 IST)

మా శత్రువు ఎంత బలవుంతుడోననే భయం మాకు లేదు : నాగబాబు

nagababu
మా శత్రువు ఎంత బలవంతుడోనన్న భయం మాకు లేదని సినీ నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు అన్నారు. ఆయన మంగళవారం సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మా శత్రువు ఎంత బలవంతుడోననే భయం మాకు లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మేము ఎవరికోసమైతే పోరాడుతున్నామో... వారో మా శత్రువుకు రక్షణ కవచంలా మారారు. లేదంటే ఈ యుద్దంలో ఎపుడో గెలిచి విజయఢంకా మోగించి ఉండేవాళ్లం" అని పేర్కొన్నారు. 
 
గత చరిత్ర కూడా ఇదే చెబుతోంది. 2019 ఎన్నికల్లోనూ ఇదే జరిగిందని నాగబాబు గుర్తు చేశారు. కానీ 2024లో అలా ఉండదని ఆయన జోస్యం చెప్పారు. ఎందుకంటే విప్లవరం వస్తోందని, జనసేన గెలవడం ఖాయమని, అతని ప్రస్థానం ఒక చరిత్ర అవుతుందని నాగబాబు పేర్కొన్నారు.