బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (14:55 IST)

రాత్రిపూట.. మహిళను వివస్త్రని చేసి కొందరు యువకులు అమానుషంగా..?

లాక్ డౌన్ కాలంలో మహిళల అకృత్యాలు, నేరాలు పెరిగిపోయాయని వార్తలు వస్తున్న తరుణంలో ఓ అమానుష ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. కొందరు యువకులు మృగాలుగా మారి ఓ యువతి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. వివస్త్రని చేసి ..దుస్తులు ఇవ్వకుండా వికృత చేష్టలకు పాల్పడ్డారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డి కాలనీలో బుధవారం రాత్రి జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. మహమూర్‌ మసీదు వెనక గొర్రెల మండీ ఉంది. దీని పక్కన నిర్మానుష్యంగా ఉండటంతో చీకటి కార్యకలాపాలకు వేదికగా మారింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఓ గొర్రెల కాపరి అటువైపు వెళుతుండగా ఓ ఆటో నిలిపి ఉంది. ఆ ప్రాంతంలో ఎందుకుందో అనుకుంటూ..అనుమానం వచ్చి చూడగా ఆరుగురు యువకులు కలసి ఒక యువతిని వివస్త్రను చేసి దుస్తులు ఇవ్వకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆయన తన దగ్గరున్న టార్చ్‌లైటు వేయడంతో వారు ఆటోలో అక్కడి నుంచి పరారయ్యారు. 
 
ఆటో వెనుక ఓ సినిమా నటుడి స్టిక్కర్‌ ఉన్నట్లు గుర్తించారు. గొర్రెల కాపరి యువతికి దుస్తులు ఇవ్వడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై నవాబుపేట సీఐ వేమారెడ్డిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. విచారణ జరుపుతామన్నారు.