శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (13:19 IST)

శ్రీరాముడిపై అభ్యంతరక పోస్టులు.. కత్తి మహేష్ అరెస్ట్..

శ్రీరాముడిపై అభ్యంతరక పోస్టులు పెట్టిన కేసులో టాలీవుడ్ వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. 
 
కాగా, కొన్ని నెలల క్రితం ఫేస్‌బుక్, ట్విటర్‌లో శ్రీరాముడి గురించి అసభ్యకర పోస్ట్‌లు పెట్టారు. ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హిందూ సంఘాలు పలు చోట్ల కేసులు పెట్టాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పలుమార్లు కత్తి మహేష్‌ను విచారించారు. శుక్రవారం విచారించిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. 
 
కాగా గతంలో పవన్‌పై అనుచిత వ్యాఖ్యల కారణంగా పవన్ ఫ్యాన్స్, కత్తి మహేష్ మధ్య కొన్ని నెలల పాటు మాటల యుద్ధం జరిగింది. ఆయనపై హైదరాబాద్‌లో ఓసారి దాడి కూడా జరిగింది. 
 
సినీ క్రిటిక్ కత్తి మహేష్ హృదయ కాలేయం, నేనే రాజు నేనే మంత్రి, కొబ్బరి మట్టతో పాటు పలు సినిమాల్లో నటించారు. అంతేకాదు పెసరట్టు సినిమా డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో పాల్గొన్నారు. ఇటీవల ఆర్జీవీ డైరెక్ట్ చేసిన పవర్ స్టార్ సినిమాల్లోనూ నటించారు కత్తి మహేష్.