మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 ఆగస్టు 2019 (12:51 IST)

చంద్రబాబుకు నోటీసులు జారీ... వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశం

ఇంటిని ఖాళీ చేయాలని  కోరుతూ చంద్రబాబు ఇంటికి శనివారం నాడు నోటీసులు జారీ చేశారు. వీఆర్ఓ ఇవాళ నోటీసులను అందించారు. వరద ముంచెత్తె అవకాశం ఉన్నందున ఇంటిని ఖాళీ చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
 
 ఎగువ నుండి వరద నీరు వస్తున్నందున  శుక్రవారం నాడు చంద్రబాబునాయుడు నివాసం మెట్ల వద్దకు నీరు చేరుకొంది. శుక్రవారం సాయంత్రానికి మరింత వరద పెరిగింది. శనివారం నాడు చంద్రబాబునాయుడు నివాసం పక్కనే ఉన్న అరటితోటలోకి నీరు చేరుకొంది.
 
దీంతో ఇంటిని ఖాళీ చేయాలని కోరుతూ చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీ చేశారు. కరకట్టపై ఉన్న నిర్మాణాల్లో కొన్నింటికి ఇప్పటికే  నీరు వచ్చింది. వరద ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ఇంటిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 
 
శుక్రవారం నాడు చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ కెమెరాలతో రికార్డు చేశారు. హై సెక్యూరిటీ జోన్ లో అనుమతి లేకుండా ఎలా డ్రోన్ కెమెరాను ఉపయోగిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నించారు.
 
ఉండవల్లి కరకట్టపై నివాసం ఉంటున్న తెలుగుదేశం పార్టీ అధినేతచంద్రబాబు  నాయుడు సహా 32 నివాసాలకు నోటీసులు జారీ చేసిన తాసిల్దార్. చంద్రబాబు ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసులు అతికించిన అధికారులు. ఆయా నివాసాల్లో ఉంటున్న వారు వెంటనే ఖాళీ చేయాలని నోటీసులో పేర్కొన్న అధికారులు.