గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 4 అక్టోబరు 2017 (19:54 IST)

సమాచార కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఒక ప్రధాన సమాచార కమిషనర్, ముగ్గురు రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు సమాచార హ

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఒక ప్రధాన సమాచార కమిషనర్, ముగ్గురు రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి  ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు సమాచార హక్కు చట్టం-2005లోని 15,16 సెక్షన్లతో తెలిపిన విధంగా తమ దరఖాస్తులు అందజేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజ్ పాణిగ్రాహి ఒక ప్రకటనలో తెలిపారు. 
 
దరఖాస్తులను వ్యక్తిగతంగా గానీ, రిజిస్టర్ పోస్టు ద్వారా గానీ ఏపీ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, 4వ అంతస్తు, డీపీఎస్ కన్‌స్ట్రక్షన్స్, సాయిబాబా గుడి ఎదురు, జాతీయ రహదారి అనుబంధ సర్వీస్ రోడ్, మంగళగిరి-522503, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ(20-10-2017) సాయంత్రం 5 గంటల లోపల అందజేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.