మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: శనివారం, 26 మే 2018 (21:49 IST)

తెలుగు ప్రజలు అంటే తెలుగుదేశం పార్టీ వారు కాదు: పవన్ కళ్యాణ్

నా దీక్ష రాజకీయ గుర్తింపు కోసం కాదు. రాజకీయంగా గుర్తింపు కావాలంటే మీకు మద్దతు ఇచ్చేవాడిని కాదు అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించారు పవన్ కళ్యాణ్. శ్రీకాకుళంలో భారత మాతా వెలిసిందని ప్రజల్లో చైతన్యం వస్తే పాలకుల్ని తన్ని తన్ని కొడతారని విమర్శించార

నా దీక్ష రాజకీయ గుర్తింపు కోసం కాదు. రాజకీయంగా గుర్తింపు కావాలంటే మీకు మద్దతు ఇచ్చేవాడిని కాదు అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించారు పవన్ కళ్యాణ్. శ్రీకాకుళంలో భారత మాతా వెలిసిందని ప్రజల్లో చైతన్యం వస్తే పాలకుల్ని తన్ని తన్ని కొడతారని విమర్శించారు. సినిమాల్లో రెండున్నర గంటల్లో సమస్యలు పరిష్కరించవచ్చు. కానీ నిజజీవితంలో అలా కాదు. 
 
సినిమాలు వదులుకొని రావటం నాకు సరదా కాదు.. ప్రజలకు సేవ చేయడం కోసం, సామాజిక రాజకీయ చైతన్యం కోసం వచ్చాను అన్నారు. ఎన్నో మార్పులు టిడిపి సర్కార్ తెస్తుంది అనుకుని ఆశపడ్డాను. కాని ఆశించింది జరగలేదన్నారు. తెలుగు ప్రజలు అంటే తెలుగుదేశం కాదు అని తెలుగుదేశం పార్టీ వారు తెలుసుకోవాలన్నారు.
 
ముఖం మీద చిరునవ్వు నవ్వి వెనక నుంచి వెన్నుపోటు అంటే ఒప్పుకోమని తెలియజేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కుమ్ములాటల మధ్య ప్రజలను బలి చేయొద్దు అని చెప్పారు. 
ప్రజల బాగు.. జనసేన బాగు అని నినదించారు పవన్ కళ్యాణ్.