సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : సోమవారం, 12 మార్చి 2018 (13:35 IST)

మంగళగిరి కాజలో పవన్ కళ్యాణ్ భూమి పూజ(ఫోటోలు-Video)

తన తండ్రి మంగళగిరిలో కానిస్టేబుల్‌గా పని చేశారని పవన్ కల్యాణ్ అన్నారు. కాజలో తన నివాసానికి భూమి పూజ అనంతరం విలేకరులతో మాట్లాడారు. జనసేన పార్టీకీ, ప్రజా సమస్యల పరిష్కారానికి అందరి సహకారం కావాలని ఆయన అన

తన తండ్రి మంగళగిరిలో కానిస్టేబుల్‌గా పని చేశారని పవన్ కల్యాణ్ అన్నారు. కాజలో తన నివాసానికి భూమి పూజ అనంతరం విలేకరులతో మాట్లాడారు. జనసేన పార్టీకీ, ప్రజా సమస్యల పరిష్కారానికి అందరి సహకారం కావాలని ఆయన అన్నారు. 
 
పార్టీకి యువత ఉడుకునెత్తురూ, పెద్దల అనుభవమూ కావాలని ఆయన అన్నారు. జనసేనపై ప్రజలకు విశ్వాసం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. దానిని నిలబెట్టుకోవాలని అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.