శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2024 (17:05 IST)

వైఎస్ షర్మిలకు భద్రత పెంచిన సీఎం జగన్ సర్కారు?

ys sharmila
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోని తప్పొప్పులను ఎత్తి చూపుతూ విమర్శలు చేస్తుండటంతో సోషల్ మీడియా వేదికగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, అందువల్ల తనకు భద్రత కల్పించాలంటూ ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం వైపు నుంచి తగిన స్పందన లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, ప్రభుత్వం నాకు భద్రత కల్పించడం లేదంటే నా చెడు కోరుకున్నట్లే కదా? అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అదేసమయంలో ఆమె తన సొంత జిల్లా కడపలో పర్యటనకు వెళ్లనున్నారు. ఆ జిల్లాలో పర్యటించే సమయంలో ఆమెకు భద్రత పెంచేలా జిల్లా ఎస్పీ ఓ ప ప్రకటన జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న 1+1 భద్రత స్థానంలో 2+2 భద్రత కల్పిస్తామని, ఈ భద్రతను షర్మిల అభ్యర్థన మేరకు పెంచుతున్నట్టు జిల్లా ఎస్పీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
అసిస్టెంట్ కెమెరామెన్‌ను మోసం చేసిన మహిళా నిర్మాత!!
 
హైదరాబాద్ నగరంలో పెళ్లి పేరుతో ఓ మహిళా సినీ నిర్మాత ఒక అసిస్టెంట్ కెమెరామెన్‌ను మోసం చేసింది. అతని నుంచి రూ.18.50 లక్షలు నగదు తీసుకుని చివరకు అతనిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన పుల్లంశెట్టి నాగార్జున  బాబు అనే వ్యక్తి టాలీవుడ్‌లో అసిస్టెంట్ కెమెరామెన్‌గా కొనసాగుతున్నాడు. ఈయనకు "భైరవపురం" సినిమా షూటింగ్ సమయంలో మహిళా నిర్మాత ఆశ మల్లికతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త పెళ్లివరకు దారితీసింది. అయితే, తనకు వివాహమైందని, భర్తకు విడాకులు ఇస్తానని నాగార్జునను నమ్మించి చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద నాగార్జునను వివాహం చేసుకుంది. ఆ తర్వాత తనకు డబ్బు అవసరం ఉందని చెప్పి అతని నుంచి రూ.18.50 లక్షల నగదును తీసుకుంది. 
 
ఈ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, అడిగితే కిరాయి మనుషులతో బెదిరింపులకు పాల్పడసాగింది. ఈ క్రమంలో మల్లిక వ్యవహారశైలిని అనుమానించిన నాగార్జున బాబు... పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒకే వివాహమైందని, పిల్లలు లేరన నమ్మించి వివాహం చేసుకుందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆమెకు ఇప్పటికే రెండు వివాహాలైనట్టు, నకిలీ పత్రాలతో మోసగించి పెళ్లిళ్లు చేసుకోవడం ఆ తర్వాత వారిని మోసం చేయడమే వృత్తిగా పెట్టుకుందని తేలింది. 2016లో గాజువాక పోలీస్ స్టేషన్‌లో 2019లో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లలో మొదటి, రెండో భర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై కేసులు నమోదైవున్నట్టు విచారణలో తేలింది.