బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (15:14 IST)

రిమాండ్‌కు లేకుండా బెయిల్ ఎలా ఇస్తారు... హైకోర్టులో పిటిషన్

tdp leader narayana
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి పి. నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను జైలుకు తరలించేందుకు చిత్తూరు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, కేసును విచారించిన మేజిస్ట్రేట్ అదే రోజు రాత్రి నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. 
 
అయితే, రిమాండ్ విధించకుండానే బెయిల్ ఎలా ఇస్తారంటూ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతోంది. ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ చిత్తూరు జిల్లా కోర్టులో ఏపీ ప్రభుత్వం రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. రిమాండ్ విధించకుండానే బెయిల్ ఎలా ఇస్తారంటూ ప్రస్తావించింది. 
 
సాధారణంగా జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ వేస్తేనే హైకోర్టులో పిటిషన్ వేసేందుకు అవకాశం ఉండటంతో ఫార్మాలిటీస్‌గా రివిజన్ వాజ్యాన్ని ప్రభుత్వం దాఖలు చేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం విచారణ జరిపే జిల్లా కోర్టు ఇచ్చే ఆదేశాలన ఆధారంగా హైకోర్టుకు వెళ్లే అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.