శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (17:28 IST)

సీఎం జగన్ మోహన్ రెడ్డికి గులకరాయి అక్కడ తగిలి వుంటే స్పాట్‌లోనే చనిపోయేవారంటున్న పోసాని

Posani-Jagan
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి గులకరాయి దెబ్బ వేరే చోట తగిలి వుంటే స్పాట్ లోనే చనిపోయేవారని వైసిపి నాయకుడు, సినీ నటుడు పోసాని కృష్ణమురళి అంటున్నారు. అదృష్టవశాత్తూ ఆ రాయి కంటి లోపల కాకుండా కనుబొమపైన తగలడంతో బతికి బయటపడ్డారని అన్నారు. చంద్రబాబు నాయుడుకి ఎవరిపై దాడి చేస్తారన్నది ముందే తెలిసిపోతుందనీ, గతంలో కూడా వర్మను మర్డర్ చేయాలనుకుంటే చంద్రబాబు నో చెప్పడంతో ఆగారంటూ వెల్లడించారు మురళి.
 
తాజాగా జగన్ పైన దాడి తెలుగుదేశం పార్టీ కుట్ర అంటూ మండిపడ్డారు. ఏకంగా ముఖ్యమంత్రినే చంపాలనుకున్నవారికి తామొక లెక్కా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడికి తెలియకుండా రాష్ట్రంలో హత్యలు జరగవంటూ పోసాని ఆరోపణలు చేసారు.