గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2019 (16:09 IST)

వేశ్యలు దేవతలు.. వాళ్లే లేకపోతే.. అంతేసంగతులు: శ్రీరెడ్డి

కంచరపాలెం సెక్స్ రాకెట్ ముఠాను గుట్టు రట్టు చేసిన పోలీసులపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యభిచారం అనేది ఒక సమాజ సేవ లాంటిది అని, అక్కడితో ఆగకుండా వేశ్యల్ని దేవతలతో పోలుస్తూ ఫేస్‌బుక్ ద్వారా ఒక పోస్టు పెట్టింది శ్రీరెడ్డి. 
 
"వేశ్యలు అనేవాళ్లు లేకపోతే.. మీ చిన్నారి కూతుళ్లకు భద్రత లేదు. వాళ్లని ఆ పని చేయనీయండి. కనీసం మగాళ్లు జంతువులుగా మారకుండా ఉంటారు. వేశ్యలంటే దేవతలు. ఎందుకంటే వాళ్లు ఈ రకంగా సామాజిక సేవ చేస్తున్నారు. ఒకవేళ ఈ వేశ్యలే లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్‌ని ఈ మగాళ్లు రేప్ చేస్తారు" అంటూ తన పోస్టు ద్వారా హెచ్చరించింది శ్రీరెడ్డి. వ్యభిచారం కొందరు సంతోషంగా వున్నప్పుడు వారిని తప్పుబట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని శ్రీరెడ్డి ప్రశ్నించింది.
 
మరోవైపు శ్రీరెడ్డి చీరకట్టు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఆలయానికి వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీరెడ్డి. అంతేగాకుండా ఇటీవల శ్రీరెడ్డి మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్లు చేసింది. అలాగే పవన్ కళ్యాణ్‌తో హారర్ సినిమా తీయాలంటూ తనదైన మార్కు పంచ్‌లు విసిరింది.
 
అంతేగాకుండా.. వివాస్పద నటి శ్రీరెడ్డి ఏపీ సీఎం జగన్‌పై ఫోకస్ పెట్టింది. ఇటీవలే రోజా గురించి వివాదాస్పద పోస్ట్ చేసిన ఆమె.. ఇప్పుడు ఏకంగా సీఎంకే సలహాలు ఇచ్చింది. రాష్ట్రానికి సాధ్యమైనంత త్వరగా పెట్టుబడులు రాబట్టడం అవసరమని శ్రీరెడ్డి సూచించింది. పెట్టుబడులను రానిస్తే.. చాలా సమస్యలు తొలగిపోతాయని చెప్పుకొచ్చింది. 
 
పారిశ్రామిక పురోగతి, వ్యవసాయ రంగాభివృద్ధి రాష్ట్రానికి వెన్నెముక అన్న శ్రీరెడ్డి.. పగలు, ప్రతీకారాలు కావని సీఎంకు హితబోధ చేసింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మీరు బాధ్యతాయుతమైన తండ్రి లాంటి వారని సీఎం జగన్‌కు గుర్తు చేసింది.