ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 జులై 2024 (12:27 IST)

రోజూ అసెంబ్లీకి రండి.. జగన్ భుజంపై చెయ్యేసి చెప్పిన ఆర్ఆర్ఆర్!

RRR_Jagan
RRR_Jagan
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గవర్నర్ ప్రసంగానికి ముందు వైకాపా అధినేత జగన్‌ పక్కనే కూర్చున్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు జగన్ భుజంపై చేయి వేసి, ప్రతిరోజూ అసెంబ్లీకి హాజరు కావాలని కోరారు. అందుకు జగన్ ఆమోదం తెలిపారు. ఉండి ఎమ్మెల్యే జగన్ పక్కన సీటు కేటాయించాలని శాసనసభ వ్యవహారాల మంత్రిని కోరారు.

తాను కరచాలనం చేసినప్పుడు జగన్‌ సానుకూలంగా లేరని, కానీ ఇబ్బంది పెట్టలేదని ఆర్ఆర్ఆర్ అన్నారు. జగన్‌ను ర్యాగ్ చేయాలనుకుంటున్నారా అని మీడియా ప్రశ్నించగా.. ఏం జరుగుతుందో మీరే చూస్తారు.. అంటూ దాట వేశారు.