గుడివాడలో 21.31 కోట్లతో ఆర్టీసీ బస్టాండ్
కృష్ణా జిల్లా గుడివాడలో 21.31 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించనున్నఆర్టీసీ బస్టాండ్ కు భూమి పూజ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిలు కొత్త బస్టాండుకు శంకుస్థాపన చేశారు.
ఏపీ ఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు, కృష్ణా ఎస్పీ యం.రవీంద్రనాథ్ బాబు, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని లను ఆర్టీసీ కార్మికులు భారీ గజమాలతో సత్కరించారు. కృష్ణా జిల్లాలో ఆర్టీసీ రద్దీ రూట్లలో ప్రయాణికులు అన్ని సౌకర్యాలు మెరుగుపరిచేందకు కృషి చేస్తోందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వివరించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా మొదలవుతున్నాయన్నారు.
పామర్రులో నీటమునిగిన ఆర్టీసీ బస్టాండ్‌ను రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పరిశీలించారు. దీనిని త్వరలో మరమ్మతు చేసి, ప్రయాణికులకు కష్టాలు లేకుండా చూడాలని ఆర్టీసీ ఎండి ద్వరకా తిరుమల రావును మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఇక్కడి సమస్యలను మంత్రి పేర్నినాని, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు దృష్టికి తెచ్చారు. సాధ్యమైనంత త్వరలో మరమ్మతు పనులు చేపడతామని ఆర్టీసీ ఎండీ హామీ ఇచ్చారు.