గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 నవంబరు 2022 (10:41 IST)

ఈస్ట్ కోస్ ఎక్స్‌ప్రెస్‌లో తొక్కిసలాట : ఇద్దరు విద్యార్థులకు అస్వస్థత

stampede
ఏపీలోని విజయనగరం సమీపంలో ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో స్వల్ప తొక్కిసలాట జరిగింది. దీంతో ఇద్దరు విద్యార్థులు ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. రైల్వే వర్గాల సమాచారం మేరకు.. ఒడిశా నుంచి ఇద్దరు బాలికలు వచ్చి ప్రకాశం జిల్లాలో బీఈడీ పరీక్షలకు హాజరయ్యారు.
 
తిరుగు ప్రయాణంలో ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కిన వారు రైలులో ఎక్కారు. అయితే, ఈ రైలులో భారీగా రద్దీ ఉండటంతో విజయనగరం సమీపంలో తొక్కిసలాట జరిగింది. దీంతో వారు ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 
 
సమాచారం అందుకున్న అధికారులు బాలికలను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ప్రయాణికుల్లో భయాందోళనకు గురిచేసింది.