ఏపీలో పగలు ఎండ.. రాత్రి వర్షం
నైరుతి రుతుపవనాలలో ఏర్పడిన మార్పుల కారణంగా ఏపీలో విచిత్ర వాతావరణం పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగలు ఎండ, రాత్రి వర్షం పడనుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
'బ్రేక్ మాన్‌సూన్'గా పిలవబడే రుతుపవనాల ప్రభావమే ప్రస్తుతం నైరుతిపై పడిందని అధికారులు వెల్లడించారు. ఫలితంగా రాష్ట్రంలో పగటి పూట ఎండలు మండుతాయని, మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
'బ్రేక్ మాన్‌సూన్' వల్ల జులై, ఆగస్టుల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు వెళ్లే అవకాశముందని వెల్లడించారు. దీనివల్ల ఉత్తరాంచల్, బీహార్, సిక్కిం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో పంజాబ్‌లలో కొద్దిపాటి వర్షాలు పడతాయి.