ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 12 జులై 2020 (15:08 IST)

ఏపీలో తాజాగా 1,914 మందికి పాజిటివ్

ఏపీలో గత 24 గంటల్లో 17,624 సాంపిల్స్ ని పరీక్షించగా 1,914 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. 846 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్ట్ చేయబడ్డారు.

కోవిడ్ వల్ల కర్నూల్ లో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూర్ లో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు, అనంతపూర్ లోఒక్కరు మరియు పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.

నేటి వరకు రాష్ట్రంలో 11,53,849 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది రాష్ట్రంలో 11,071 మంది ఆసుపత్రులలో మరియు 2,357 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో వెరసి మొత్తం 13,428 మంది చికిత్స పొందుతున్నారు.