గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (08:35 IST)

టీడీపీవి చౌక‌బారు చేష్ట‌లు: ఎమ్మెల్యే విడదల రజిని

తెలుగుదేశంపార్టీకి చెందిన ఎస్సీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి చిల‌క‌లూరిపేట‌ ఎమ్మెల్యే విడదల రజిని కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సంద‌ర్భంగా టీడీపీ నుంచి ఎస్సీ నాయ‌కులు మాట్లాడుతూ.. శ్మ‌శాన వాటిక‌ విష‌యంలో టీడీపీ ఎస్సీల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా వ్య‌వ‌హ‌రించింద‌న్నారు. స్వార్థ రాజ‌కీయాల్లో ఎస్సీల‌ను బ‌లిప‌శువుల‌ను చేయాల‌ని చూస్తున్నార‌ని మండిప‌డ్డారు.

టీడీపీ తొలి నుంచి ఎస్సీల విష‌యంలో శ‌వ‌రాజ‌కీయాలు చేస్తూనే ఉంద‌ని విమ‌ర్శించారు. ఏమీ లేని అంశంలో అతి చొర‌వ ప్ర‌ద‌ర్శించి లేనిపోని విష‌ప్ర‌చారాల‌కు ఒడిగ‌డుతున్నార‌ని మండిప‌డ్డారు.

మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న మాట్లాడుతూ శ్మ‌శాన‌వాటిక అభివృద్ధి ప‌నులు నేప‌థ్యంలో అధికారుల అవ‌గాహ‌న రాహిత్యం వ‌ల్ల చిన్న పొర‌పాటు జ‌రిగితే.. దాన్ని అడ్డంపెట్టుకుని రాజ‌కీయాలు చేయాల‌ని టీడీపీ చూస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. కుల రాజ‌కీయాలు, శ‌వ‌రాజ‌కీయాలు టీడీపీకి వెన్న‌తోపెట్టిన విద్య అని మండిప‌డ్డారు.

రాజ‌కీయస్వార్థం కోసం మ‌రీ ఇంత దిగ‌జారుడుత‌నాన్ని ప్ర‌ద‌ర్శించాలా అని దుయ్య‌బ‌ట్టారు.అక్కడ ఎం జరుగుతుందో కూడా తెలియని అయోమయంలో టీడీపీ నాయకులు ఉన్నారని నిన్న ఒకరు పెట్రోల్ బంక్ పెడుతున్నారని చెప్పారని అక్కడ క్రిమిటోరియం కడతన్నారు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదని, ఇటువంటి రాజకీయాలు చేస్తే  తెలుగుదేశంలో ఉన్న కొద్దిమంది ఎస్సీలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, త్వ‌ర‌లోనే ఎస్సీలు లేని పార్టీగా చిల‌క‌లూరిపేట‌లో టీడీపీ మిగులుతుంద‌ని స్ప‌ష్టంచేశారు.

కార్య‌క్ర‌మంలో పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహా ఖాన్,పార్టీ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,పార్టీ అధికార ప్రతినిధి షేక్ దరియవలి, ముస్లిం,మైనారిటీ సెల్ అధ్యక్షుడు బేరింగ్ మౌలాలి,బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి వీరాంజనేయులు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాలకోటి నాయక్, మరియు కొలిశెట్టి శ్రీనివాసరావు,కొప్పుల జ్యోతి రత్నబాబు,బండారు జయకుమార్, పందుల బుల్లెబ్బాయి,సాతులూరి రవి,నకిరికంటి శ్రీకాంత్,మర్రిపాలెం ఉదయ్,బొందు మస్తాన్, నల్లూరి సాంబశివరావు,మరియు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.