శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (20:29 IST)

టిడిపి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా ఆమోదం

టిడిపి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామాను మండలి చైర్మన్‌ ఆమోదించారు. గతంలో టిడిపి ఎమ్మెల్సీగా ఉంటూ వైసిపికి అనుకూలంగా వ్యవహరించిన పోతుల సునీతపై అనర్హత వేటుకు మండలి చైర్మన్‌కు టిడిపి ఫిర్యాదు చేసింది.

దీనిపై మండలి చైర్మన్‌ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. తర్వాత సునీత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో దాన్ని మండలి చైర్మన్‌ ఆమోదించారు. ఏపీ శాసనమండలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలుత సభ ప్రారంభం కాగానే మండలి చైర్మన్‌ షరీఫ్‌ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అనుమతించారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలుకు సభ నివాళులర్పించింది. అనంతరం సభను బీఏసీ కోసం వాయిదా వేశారు. అనంతరం సంతాప తీర్మాలను మండలి ఆమోదిస్తున్నట్లు చైర్మన్‌ షరీఫ్‌ తెలిపారు. సభను మొత్తం ఐదురోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.