గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 7 మే 2021 (20:32 IST)

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల నియామకం కొత్త మలుపు

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల నియామకం కొత్త మలుపు తిరిగింది. పదవీ విరమణ పొందిన ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, నరసింహ దీక్షితులను తిరిగి నియమిస్తూ ఏప్రిల్ 2న టీటీడీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే... ప్రస్తుతం గొల్లపల్లి, తిరుపతమ్మ కుటుంబాల నుంచి ప్రధాన అర్చకులుగా వేణుగోపాల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు కొనసాగుతున్నారు. వారిని ఆ పదవి నుంచి ఎందుకు తొలగించకూడదంటూ టీటీడీ నోటీసులు జారీ చేసింది. దీంతో వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు.

అయితే వేణుగోపాల దీక్షితుల కేసులో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గోవిందరాజ దీక్షితుల కేసులో హైకోర్టు స్టే మంజూరు చేసింది. హైకోర్టు స్టేతో రమణ దీక్షితుల, నరసింహ దీక్షితుల నియామకం మళ్లీ మొదటికి వచ్చినట్లైంది.