శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (10:18 IST)

పుష్కర కాలమైనా తేలని ఆయేషా కేసు

విజయవాడకు సమీపంలోని ఇబ్రహీం పట్నం హాస్టల్లో 2007 డిసెంబర్ 27న జరిగిన అతి దారుణమైన ఆయేషా మీరా హత్య కేసు పుష్కర కాలం కావస్తున్నా  కొలిక్కి రాక పోవటం పై చర్చోప చర్చలు జరుగుతున్నాయి.

కొద్దీ రోజుల క్రితం షాద్ నగర్ లో  దిశ పై అత్యాచారం హత్య. పైగా దిశ మృత దేహాన్ని కాల్చేయడం వంటి సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది  నిందితులను గుర్తిచడం.  అరెస్ట్ చేయడం సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం వారిని సంఘటన జరిగిన చోటికి తీసుకు వచ్చిన పోలీసులపై తిరగ బడటంతో నలుగురి నిందితులను ఎన్కౌంటర్ చేయడం.

ఈ సంఘటనపై విజయవాడలో పెద్ద ఎత్తున సంబరాలు జరిగిన విషయం తెలిసిందే ఆ సంఘటనపై మానవహక్కుల కమిషన్ జోక్యం ..సుప్రీం  కోర్టులో విచారణ వంటివి పక్కన పెడితే ..ఆయేషా కేసు విషయంలో మాత్రం 12 సంవత్సరాలు జరుగుతున్నా  ఒక కొలిక్కి రాలేదు. ఆయేషా కేసులో మొదటి అంకమంతా గూడ అనేక మలుపులు తిరిగింది..

కేసులో  రాజకీయ అనుబంధమ్ ఉన్న వ్యక్తులు   నిందితులు అని బాగా ప్రచారం జరిగినప్పటికీ అనసాగరం వాసి సత్యం బాబు సెల్ ఫోన్ దొంగతనం కేసులో పట్టు బడితే అతనిపై ఆయేషా హత్య కేసు నిందితుడుగా  ఎస్టాబ్లిష్ అయింది. అంతకు ముందు ఒకరిద్దరు  నిందితులను తీసుకొచ్చి పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చినా ఫలితం  లేకపోయింది.

సత్యం బాబును  2008 లో అరెస్ట్ చేసి కేసు పెట్టారు. అతనిని అరెస్ట్ చేసి తీసుకు వెళుతుండగా తప్పించుకోవటం..దరిమిలా 11 మంది పోలీసులను సస్పెండ్ చేశారు..ఆ తరు వాత సత్యం బాబుకు  విజయవాడ కోర్టు శిక్ష వేసింది.అయితే దీనిమీద వేసిన అప్పీల్ పై జరిగిన విచారణలో సత్యం బాబుపై సాక్ష్యాలు లేవంటూ హై కోర్టు కొట్టివేసింది.

దీంతో అసలు నిందితులెవ్వరన్నది ప్రశ్నగా మారింది. పొలిటికల్ గా  . సామాజికంగా ఈ కేసు పెద్ద సవాలుగా మారింది. తరువాత సిట్ వేశారు..ఆతరువాత సీ బీ ఐ కు అప్పగించారు..రికార్డులను చూస్తున్నప్పుడు సాక్ష్యానికి సంబంచిన రికార్డులు లేక పోవడంతో కొందరు కోర్టు సిబ్బందిపై కేసు నమోదు చేశారు. ఇలా జరుగుతున్న నేపద్యలో ఇప్పటికి 12 సంవత్సరాలు గిర్రున తిరిగాయి.

ఇప్పుడు అసలు నింధితులను పట్టుకుంటారన్న ఆశలు సన్నగిల్లాయని..తన కుమార్తె కేసులో తీవ్ర అన్యాయమే జరిగిందని ఆయేషా మీర తల్లి తాజాగా వాపోతున్నది.సత్యం నిందితుడు కానప్పుడు మరెవరో అన్నదే ఇప్పడు అందరి నోటా వినిపిస్తున్న మాట. ఇది ఇలా ఉంటే ఇక ఆడ వాళ్ల పై చేయి వేస్తే . వాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడితే రాష్ర్టంలో కఠిన శిక్షలు అమలు కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ లో బిల్ శుక్రవారం ఆమోదం పొందింది.. ఇందులో హై లైట్లు ఇలా ఉన్నాయి
 
కేంద్ర ప్రభుత్వం చట్టంప్రకారం, నిర్భయ కేసుల్లో  జైలు లేదా మరణదండనను శిక్షగా విధిస్తుంటే... రాష్ట్రం ప్రవేశపెట్టిన చట్టం ద్వారా రేప్‌ చేసినవారికి తప్పనిసరిగా మరణదండన విధిస్తారు.
 
నిర్భయం చట్టం ప్రకారం– 2 నెలల్లో దర్యాప్తు పూరై్త, మరో 2  నెలల్లో శిక్షలు పడాలి. అంటే మొత్తం 4 నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ ఈరెండూ పూర్తికావాలి. 
 
దీన్ని ఏపీ దిశ చట్టంలో 4 నెలలకు కాదు 21 రోజులకు కుదిస్తున్నాం. అత్యాచార నేరాల్లో విస్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభించినటై్టతే 21 రోజుల్లోపే నిందితుడికి శిక్ష పడాలి. వారంరోజుల్లో పోలీసు దర్యాప్తు పూర్తికావాలి. 14 రోజుల్లోపే న్యాయప్రక్రియ పూరై్త శిక్ష పడాలని నిర్ణయించారు.
 
అత్యాచార సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని కూడా విధించ నున్నారు కేంద్రం చేసిన ‘‘పోక్సో’’ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు కనసీం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకూ శిక్ష విధించవచ్చు. 
 
మన రాష్ట్రంలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. అంటే పిల్లలపై ఇక ఎలాంటి లైంగిక నేరాలుచేసినా జీవితాంతం జైల్లో ఉండటమో, లేక ఉరికంబం ఎక్కడమో జరగాల్సి ఉంటుంది. 
 
అత్యాచార నేరాలకు మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారి విషయంలో కేంద్రం విధించిన ఒక ఏడాది గడువుకు బదులు... దర్యాప్తు 7 రోజుల్లో చేసి, న్యాయ ప్రక్రియ 14 పనిదినాల్లో పూర్తిచేసేలా చట్టానికి సవరణ తీసుకు వచ్చారు. 
 
సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధించడం, వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం లాంటివి చేస్తే ఐపీసీ ప్రకారం ఇప్పటివరకూ శిక్షలు నిర్దిష్టంగా లేవు. 
 
ఈ చట్టం ద్వారా– మెయిల్స్‌ద్వారా గాని, సోషల్‌ మీడియాద్వారా గాని, డిజిటల్‌ విధానంలోగాని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటై్టతే మొదటి తప్పుకు 2 ఏళ్లు, ఆతర్వాత తప్పుకు 4 ఏళ్లు శిక్ష విధించేలా ఐపీసీలో 354 (ఇ) అనే కొత్త సెక్షన్‌ను తీసుకు వచ్చారు.

ఇంతవరకూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ మహిళలపై, పిల్లలపై నేరాల సత్వర విచారణకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టు లేనేలేవు. కొద్దిరాష్ట్రాల్లో మాత్రం ఈ నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఉన్నాయని కాని,  జిల్లాకు ఒకటి ఎక్కడా లేదు. 
 మహిళలు, పిల్లలపై నేరాల విచారణవేగంగా  ముగించడానికి వీలుగా ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నారు.

ఈ కోర్టుల్లో అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, సోషల్‌మీడియా ద్వారా అసభ్యంగా చూపించడం, వేధించడం వంటి నేరాలు, పోక్సో పరిధిలోకి వచ్చే అన్ని నేరాలు ఈ కోర్టు పరిధిలోకి తీసుకువచ్చారు. జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్‌ స్పెషల్‌ పోలీస్‌ టీమ్స్‌ను ఇందుకోసం ఏర్పాటు చేసేందుకు ఈచట్టంద్వారా వీలు కల్పించారు.

అలాగే ప్రతి ప్రత్యేక కోర్టుకు, ప్రత్యేకంగా పబ్లిక్‌ప్రాసిక్యూటర్లని నియమించుకునే అవకాశాన్ని ఇస్తూ ఈ చట్టాన్ని చేశారు.  
మహిళలు, పిల్లలపై నేరాలను నమోదుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్‌ రిజిస్ట్రీని పెట్టింది. అయితే ఆ రిజిస్ట్రీ ద్వారా డిజిటల్‌ పద్దతిలో డేటా బేస్‌ ఉంచి, జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు. అంటే, ఏ నేరగాడు, ఏ నేరం చేశాడన్న వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. 
 
కాని, అటువంటి డిజిటిల్‌ రిజిస్ట్రీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా ఈ నేరాలకు సంబంధించిన వివరాలు అన్నింటినీ ప్రజలందరికీ అందుబాటులోకి ఉంచడంద్వారా అఫెండర్ల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు. చట్టం ముందే కాకుండా సమాజం ముందు వారిని నిలబెడతారు.