ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 18 మార్చి 2020 (18:21 IST)

తిరుమల పుష్కరిణిలో ఇక స్నానం చేయలేరు.. ఎందుకు?

కరోనా ప్రభావంతో తిరుమలలో పుష్కరిణిని తాత్కాలికంగా మూసివేయనున్నారు. స్వయంగా ఇదే విషయాన్ని టిటిడి తిరుమల ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి వెల్లడించారు. శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ అనే అంశం తమ దృష్టికి వచ్చినట్లు ఆయన చెప్పారు. 
 
కరోనా నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణిలోకి భక్తులను రేపటి నుంచి అనుమతించమని చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోనేటి నీళ్ళను షవర్స్ ద్వారా అందిస్తామని.. భక్తులు గమనించి వాటి కిందే స్నానం చేయాలని కోరారు.
 
అనారోగ్యంతో ఉన్న వారు తిరుమలకు రావద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని.. భక్తులు తమకు సహకరించాలని కోరుతున్నారు. విదేశీ భక్తులు కూడా తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు.