గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మే 2023 (10:38 IST)

తిరుమలలో భక్తుల రద్దీ.. హుండీ ఆదాయం రూ.3.66కోట్లు

tirumala
తిరుమల శ్రీ వారి ఆలయంలో వేసవి కాలం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగింది. తిరుమలలో ఆదివారం శ్రీవారిని 78, 818 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.3.66 కోట్లు చేరింది. 
 
అలాగే శ్రీవారికి 39,076 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇంకా టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది.