సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (12:48 IST)

బెంజ్ కారును ఢీకొన్న ట్రాక్టర్‌ - రెండు ముక్కలైంది..

tractor accident
తిరుపతి జిల్లా చంద్రగిరి బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. మెర్సిడెజ్ బెంజ్ కారును ఓ ట్రాక్టర్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ రెండు ముక్కలైంది. భూమిపై నూకలు మిగిలివుండటంతో ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అలాగే, బెంజ్ కారు ముందు భాగం బాగా దెబ్బతింది. రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్ బెంజ్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం దెబ్బతినంగా ట్రాక్టర్ మాత్రం రెండు ముక్కలైంది. 
 
ట్రాక్టర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, కారులోని ప్రయాణికులు మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలైన కామెంట్స్ చేస్తున్నారు. ట్రాక్టర్ కంటే మెర్సీడెజ్ బెంజ్ మరింత స్ట్రాంగ్‌గా ఉంటుందనే విషయం ఈ ప్రమాదం ద్వారా నిరూపితమైందంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.