శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (09:42 IST)

మనస్సు మార్చుకున్న అధికారులు - టీఎస్ ఆర్టీసీలో ఇక అదనపు బాదుడు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) తన నిర్ణయాన్ని మార్చుకుంది. పండగలు, జాతర్లు వంటి వాటికి నడిపే అదనపు బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయరాదని తీసున్న నిర్ణయంపై యూ టర్న్ తీసుకుంది. దీనికి కారణంగా గత జనవరి నెలలో ఉన్నట్టుండి ఆదాయం తగ్గిపోయింది. 
 
డిసెంబరు నెలతో పోల్చుకుంటే ఈ ఆదాయంలో ఏకంగా రూ.50 కోట్లకు పైగా తగ్గింది. దీంతో ప్రస్తుతం ముచ్చింతల్‌లో జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు ఆ తర్వాత సామ్మక్క సారలమ్మ జాతరలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం టీఆఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. 
 
గత దసరా, దీపావళి, ఆ తర్వాత సంక్రాంతి పండుగలకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. ఈ బస్సుల్లో ఒక్క పైసా కూడా అదనపు చార్జీ వసూలు చేయకుండా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చర్యలు తీసుకున్నారు. దీనివల్ల ఆర్టీసీ ఆదాయం రూ.75 నుంచి రూ.100 కోట్ల మేరకు ఆదాయం కోల్పోయింది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం మనసు మార్చుకుంది. ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకల కోసం హైదరాబాద్ నుంచి నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.
 
అదేవిధంగా తెలంగాణా రాష్ట్రంలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతర కోసం ఈ నెల 13వ తేదీ నుంచి నడుపనున్న ప్రత్యేక బస్సుల్లోనూ అదునపు చార్జీలు వసూలు చేయాలని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 
కాగా, గత యేడాది టీఎస్ ఆర్టీసీ ఏకగా రూ.337.79 కోట్ల ఆదాయన్ని అర్జించింది. కానీ, ఈ దఫా రూ.51 కోట్లు తగ్గి, రూ.287.07 కోట్లుగా ఉంది. డిసెంబరు నాటి ఆదాయం కంటే కూడా రూ.65.55 కోట్ల ఆదాయాం తగ్గినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.