శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (16:17 IST)

శ్రీవారి పాదాల చెంత హోదా ఇస్తామని చెప్పి మోసం: వై.వి.సుబ్బారెడ్డి

ఆధ్మాత్మిక కార్యక్రమాల కన్నా తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు టిటిడి ఛైర్మన్, చిత్తూరు జిల్లా వైసిపి ఇన్‌ఛార్జ్ వై.వి.సుబ్బారెడ్డి. మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నానిలతో కలిసి వైసిపి అభ్యర్థి గురుమూర్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
 
అశేషంగా తరలివచ్చిన వైసిపి కార్యకర్తలు, నాయకుల నడుమ ఉప ఎన్నిక ప్రచారం సాగింది. ఈ సంధర్భంగా వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎపికి ఎందుకు హోదా ఇవ్వలేదో ఎపి ప్రజలకు బిజెపి సమాధానం చెప్పాలన్నారు. శ్రీవారి పాదాల చెంత హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. 
 
ఇప్పుడు పుదుచ్చేరికో.. ఇంకేదో రాష్ట్రానికో ప్రత్యేక హోదా ఇస్తున్నారనేది ముఖ్యం కాదు.. 14వ ఆర్థిక సంఘం ఎక్కడ హోదా ఇవ్వద్దు అని చెప్పలేదన్నారు. టిడిపి ఎప్పుడో హోదాను తాకట్టు పెట్టిందని.. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు.