సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 23 ఫిబ్రవరి 2019 (20:44 IST)

సుగుణమ్మ భ్రష్టుపట్టిస్తున్నారు... బోరున ఏడ్చేసిన తుడా చైర్మన్...

తిరుపతి టిడిపిలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎన్టీఆర్ గృహకల్ప ఇళ్ళ కేటాయింపులో ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా ఛైర్మన్ నరసింహయాదవ్ మధ్య విభేధాలు బయటపడ్డాయి. తనకు ఇష్టమొచ్చిన వారికి ఎన్టీఆర్ గృహకల్ప కేటాయింపులను ఎమ్మెల్యే చేస్తున్నారని, తాము రెకమెండేషన్ చేసే వారిని పక్కనపెట్టేస్తున్నారని ఆరోపించారు తుడా ఛైర్మన్. 
 
తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యే సుగుణమ్మ భ్రష్టు పట్టిస్తున్నారని, నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కంటతడి పెట్టారు. సుగుణమ్మ వ్యవహార శైలితో తుడా ఛైర్మన్ పదవికి, పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు తుడా ఛైర్మన్.
 
తనపై నిరాధారమైన ఆరోపణలు తుడా ఛైర్మన్ చేస్తున్నారన్నారు తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఎన్టీఆర్ గ్రుహ కల్ప ఇళ్ళ కేటాయింపులు జరుగుతున్నాయని, తన వ్యక్తిగతంగా ఎవరికీ ఇళ్ళను కేటాయించడం లేదన్నారు ఎమ్మెల్యే. అయితే గత కొన్నిరోజుల ముందు ఎమ్మెల్యే సీటు కోసం నరసింహ యాదవ్ సిఎంను కలవడం సుగుణమ్మకు ఇష్టం లేదు. దాంతో ఇద్దరి మధ్య విబేధాలు ప్రారంభమైనట్లు ప్రచారంలో ఉంది.