గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (08:16 IST)

రాష్ట్రంలో 94 శాతం ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి: మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని ఇప్పటికి 94శాతం ఉపాధ్యాయులకు వాక్సిన్ వేయటం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు.

కేవలం 15,083 మంది అనగా 6 శాతం ఉపాధ్యాయులకు మాత్రమే వాక్సిన్ వేయాల్సి ఉందని త్వరలోనే 100 శాతం పూర్తి చేయటం జరుగుతుందన్నారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విశాఖపట్నం 100 శాతం వాక్సిన్ ప్రక్రియ పూర్తి కాగా కడపలో 99 శాతం, విజయనగర, చిత్తూరు, నెల్లూరు లలో 98 శాతం, ఉపాధ్యాయులు వాక్సిన్ వేయించుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే 86 శాతం పూర్తయిందని, ఇక్కడ ఇంకా 4 వేల మందికి వాక్సిన్ వేయాల్సి ఉండగా వేగవంతం చేయాలని అధికారులకు సూచించామని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తంలో సగటు 94 శాతం ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తయినట్టు మంత్రి సురేష్ వెల్లడించారు.