ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (23:32 IST)

దేశంలో కరోనా కేసుల వివరాలు.. తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ అప్డేట్

దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,941 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 350 మంది మరణించారు. ఈ మహమ్మారి నుంచి మరో 36,275 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,70,640 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
 
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,38,560 మంది కరోనాకు బలయ్యారు. కేరళలో కొత్తగా 19,622 కేసులు నమోదు కాగా, 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటి వరకు 64.05 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.
 
తెలంగాణలో సోమవారం 75,102 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 340 మందికి పాజిటివ్‌ వచ్చింది. వైర్‌సతో మరో ఇద్దరు మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 6,57,716కు, మరణాలు 3,872కు పెరిగాయి. కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీలోనే 72 నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 5,891 యాక్టివ్‌ కేసులున్నాయి.
 
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 41,173 శాంపిల్స్ టెస్ట్ చేయగా 878 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2013001కి చేరింది. కొత్తగా 13 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13838 కి చేరింది.