శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (10:41 IST)

ఒక్క కేరళలో 19 వేలు - దేశంలో 30 వేల పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. కానీ, కేరళ రాష్ట్రంలో మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశంపై చెప్పుకోవచ్చు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 30941 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే అందులో 19622 పాజిటివ్ కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. 
 
దేశ వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 30,941 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 350 మంది మ‌ర‌ణించారు. ఈ మ‌హ‌మ్మారి నుంచి మ‌రో 36,275 మంది కోలుకున్నారు. 
 
ప్ర‌స్తుతం 3,70,640 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టివర‌కు 4,38,560 మంది క‌రోనాకు బ‌ల‌య్యారు. కేర‌ళ‌లో కొత్త‌గా 19,622 కేసులు న‌మోదు కాగా, 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 64.05 కోట్ల‌కు పైగా టీకా డోసుల పంపిణీ జ‌రిగింది.