ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 2 మే 2023 (19:55 IST)

పాక ఇడ్లీకి ఫిదా అయిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

paka idli
విజయవాడలోని మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ కాలనీలోని ఎస్‌ఎస్‌ఎస్‌ ఇడ్లీ సెంటర్‌లో నేతి ఇడ్లీని ఆస్వాదించేందుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచ్చేశారు. ఈ ప్రాంతంలో పాక ఇడ్లీగా పేరొందిన ఈ ఇడ్లీలను ఆరగించేందుకు ఆయన బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌రావుతో కలిసి వెంకయ్యనాయుడు విజయవాడకు వచ్చారు. 
 
ఈ రెస్టారెంట్‌ను సందర్శించిన వెంకయ్య నాయుడు, పాక ఇడ్లీ పట్ల తనకున్న ఇష్టాన్ని తెలియజేస్తూ, పాక ఇడ్లీని ఆరగించారు. మాజీ మంత్రి కామినేనితో పాటు మరికొందరు నేతలు కూడా ఆరగించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు స్పందిస్తూ, నాణ్యమైన భోజనం అందిస్తున్న యజమాని కృష్ణప్రసాద్‌ను అభినందించారు. పిజ్జాలు, బర్గర్‌ల వంటి ఫాస్ట్ ఫుడ్‌ల కంటే సాంప్రదాయ ఆహారాన్ని ఎంచుకోమని యువతను ప్రోత్సహించారు, ఇది వారి ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.