ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 12 నవంబరు 2021 (14:59 IST)

వెంక‌టాచ‌లం చేరుకున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్య నాయుడు

చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక రైల్ ల్లో వెంకటాచలం స్టేషనుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ కెవిన్ చక్రధర్ బాబు అధికారులు ఉప‌రాష్ట్ర‌ప‌తికి పుష్పగుచ్ఛంతో సాదర స్వాగతం ప‌లికారు. వెంకటాచలం స్టేషన్ నుంచి  ప్రతిష్టాత్మక ఉపరాష్ట్రపతి కాన్వాయ్ తో స్వర్ణ భారతి ట్రస్ట్ కు చేరుకున్నారు. 
 
 
స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రధాన నిర్వాహకులు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ తో కలిసి ఇక్క‌డ జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ లో సమావేశ మందిరం,  వైద్య శిబిరం భవనం, స్వర్ణ భారతి ట్రస్ట్ ప్రధాన ఆవరణను సందర్శిస్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు క్షేమ సమాచారం తెలుసుకున్నారు.


సాయంత్రం నాలుగు గంటలకు ఆయ‌న ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది. ఈ లోగా స్వర్ణభారతిలోని తన మందిరంలో వెంక‌య్య విశ్రమించారు. అక్క‌డే ఆయ‌న నెల్లూరు జిల్లా అధికారులతో పలకరింపులు జ‌రిపి త‌న ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను తెలియ‌జేశారు.