1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (11:45 IST)

నవంబర్ 12, 13, 14 తేదీల్లో ఉపరాష్ట్రపతి నెల్లూరు రాక

భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నవంబర్ 12 నుంచి 14 తేదీ వరకు నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా వారు నవంబర్ 12వతేదీ సాయంత్రం నెల్లూరులోని వీపీఆర్ ఫంక్షన్ హాలులో లాయర్ పత్రిక తుంగ పండుగ (40 ఏళ్ల ఉత్సవాల్లో)లో పాల్గొంటారు. 
 
అనంతరం రత్నం సంస్థల వ్యవస్థాపకులు రత్నంని పరామర్శించేందుకు వారి ఇంటికి వెళ్తారు. 13వ తేదీ ఉదయం 10 గంటలకు వెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్టులో తమ అత్తగారైన శ్రీమతి అల్లూరి కౌసల్యమ్మ స్మారకార్థం ‘కౌసల్యాసదనం’ పేరుతో ఏర్పాటుచేసిన వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్ర నూతన భవనాన్ని ప్రారంభిస్తారు.

13వ తేదీ ఉదయం 11 గంటలకు ముందస్తు అనుమతి పొందిన సందర్శకులను కలుస్తారు. నవంబర్ 14 ఉదయం 10 గంటలకు కేంద్ర గృహమంత్రి అమిత్ షా తో కలిసి స్వర్ణభారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం తిరుపతికి వెళ్లి అక్కడినుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్తారు.
 
కరోనా నేపథ్యంలో సందర్శకులు పాటించాల్సిన నిబంధనలు:
1. ముందుగానే అనుమతి తీసుకోవాలి
2. మాస్కు తప్పనిసరిగా ధరించాలి
3. ఆరడుగుల దూరాన్ని పాటించాలి
4. వాక్సినేషన్ సర్టిఫికేటును ఫోన్ లో సేకరించి అడిగినప్పుడు చూపించాలి
5. సందర్శన అనుమతికై కింది నెంబర్లను సంప్రదించాలి
కె. విక్రాంత్ – 8130455777
సురేశ్ బాబు జీ - 7042557799
సీహెచ్ జనార్ధనరాజు - 9440425225