బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2018 (15:10 IST)

చిరంజీవి చేసేందేమీ లేదు.. పవన్ వల్ల ఒరిగేదేమీలేదు: విజయశాంతి

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీనియర్ నటి విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో రాణించడం అంత సులభం కాదని, మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించి చేసిందేమీ లేదని.. అలాంటప్పుడు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీనియర్ నటి విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో రాణించడం అంత సులభం కాదని, మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించి చేసిందేమీ లేదని.. అలాంటప్పుడు ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ వల్ల కూడా ఒరిగేదేమీ వుండదన్నారు. పవన్ కల్యాణ్ తన స్వార్థ ప్రయోజనాల కోసమే రాజకీయాల్లోకి వచ్చాడన్నారు. 
 
తెలంగాణ ప్రజలు తెలివైన వారని.. వారెవ్వరూ జనసేన అంటూ ముందుకు వచ్చినా నమ్మరమని విజయశాంతి తెలిపారు. తాను చురుకుగా రాజకీయాల్లో ఉంటానని.. తనను ఎన్నికల్లో పోటీ చేయాలని స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారన్నారు. తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన వారిని కేసీఆర్ తన మంత్రివర్గంలో చేర్చుకోవడంతోనే ఆయన నుంచి దూరమయ్యాయని విజయశాంతి తెలిపారు.