Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింక మాంసంతో మద్యం పార్టీ...

Updated: ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (14:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌ జిల్లాలో ఓ యువకుడు జింక మాంసం కూరతో మద్యం పార్టీ చేసుకున్నాడు. ఇందుకోసం ఆ కుర్రోడు జింకను వేటాడి చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు... ఆ వేటగాడిని అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం భానపూర్ గ్రామానికి చెందని శేఖర్ అనే యువకుడు ఓ జింకను వేటాడాడు. అనంతరం దాన్ని చంపి పార్టీ చేసుకున్నాడు. ఈ ఘటనపై రహస్య సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు శేఖర్ ఇంటిపై దాడిచేశారు.
 
ఈ సందర్భంగా జింక తల, కాళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో శేఖర్‌పై వణ్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదుచేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద నెమళ్లు, జింకలు వంటి జీవులను వేటాడటంపై ప్రభుత్వాలు నిషేధం విధించాయి. మరోవైపు శేఖర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

అన్నీ చూడండి

Raja Singh: ఫ్యామిలీతో చూసే సినిమా తీయండని యశ్ కు రాజాసింగ్ విజ్నప్తి

Vijay Deverakonda: ఆయన పిలిచాక రాకుంటే నేను బతికి ఎందుకు?.. విజయ్ దేవరకొండ ఎమోషనల్

Gautam: గౌతమ్ ఘట్టమనేని కు కుటుంబసభ్యులు, ఫౌండేసన్ శుభాకాంక్షలు

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

తర్వాతి కథనం
Show comments