శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2024 (10:15 IST)

జైలు నుంచి విడుదలైన కోడి కత్తి శ్రీను

kodikathi case
కోడికత్తి కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన జె శ్రీనివాసరావు విశాఖపట్నంలోని సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యాడు. అక్టోబరు 25, 2018న విశాఖపట్నం విమానాశ్రయంలోని టెర్మినల్ భవనంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి చేసినందుకు ఇతను అరెస్టయ్యాడు. దాడి తర్వాత కోడి కత్తి శ్రీను అని పిలిచే శ్రీను ఘటన జరిగినప్పుడు విమానాశ్రయ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. 
 
దాడిలో జగన్ మోహన్ రెడ్డి ఎడమ చేతికి బలమైన గాయం కావడంతో విమానాశ్రయంలో ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్‌కు బయలుదేరారు. నిందితుడిని వెంటనే సీఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుని నగర పోలీసులకు అప్పగించారు. 
 
కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ చేపట్టింది. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు అతనికి మే 25, 2019న బెయిల్ మంజూరు చేసింది. విడుదలైన కొద్ది రోజుల తర్వాత అతన్ని మళ్లీ కస్టడీలోకి తీసుకున్నారు. కాగా, జగన్ మోహన్ రెడ్డిపై దాడి వెనుక ఎలాంటి కుట్ర లేదని ఎన్ఐఏ స్పష్టం చేసింది.